సాహో దర్శకుడితో చరణ్?

Thursday,April 09,2020 - 01:40 by Z_CLU

సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసిన సుజీత్ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడా? నిజానికి ఇది గాసిప్ కాదు. డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్టు. చరణ్ ఓకే చెబుతాడా చెప్పడా అనేది మాత్రమే పెండింగ్.

RRR తర్వాత చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పటివరకు కన్ ఫర్మ్ కాలేదు. మధ్యలో వంశీ పైడిపల్లి పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడు సుజీత్ పేరు కూడా లిస్ట్ లో యాడ్ అయింది. సుజీత్ డైరక్షన్ లో చరణ్ హీరోగా సినిమా చేయాలని గట్టిగా ట్రై చేస్తోంది యూవీ క్రియేషన్స్ బ్యానర్.

ప్రస్తుతం ఈ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అది కంప్లీట్ అయిన వెంటనే చరణ్-సుజీత్ కాంబోలో సినిమా చేయాలనేది ఆ నిర్మాతల ప్లాన్.

చరణ్ దగ్గర ఇప్పుడు చాలా టైమ్ ఉంది. RRR కంప్లీట్ అవ్వాలి. మధ్యలో ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ చేయాలి. ఈ రెండు కంప్లీట్ అయ్యేలోగా సుజీత్ ప్రాజెక్టుపై చరణ్ ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది.