చెర్రీ లిస్ట్ లో ఆ డైరెక్టర్ కూడా ఉన్నాడట ..

Saturday,January 21,2017 - 05:24 by Z_CLU

లేటెస్ట్ గా ‘ధృవ’ తో గ్రాండ్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ మూడు సినిమాల పై ఫోకస్ పెట్టబోతున్నాడు. ప్రస్తుతం నిర్మాతగా ‘ఖైదీ నంబర్ 150’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చెర్రీ త్వరలోనే సుకుమార్ డైరెక్షన్ నటించే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈ సినిమా ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వం లో మరో సినిమాను స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్ నిర్మాణం లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ప్రెజెంట్ ఈ ముగ్గురు దర్శకులకి డేట్స్ ఇచ్చిన చెర్రీ వీరి తో పాటు మరి కొందరు దర్శకులను కూడా లైన్ పెట్టేస్తున్నాడు. ఇప్పటికే చరణ్ డైరెక్టర్స్ లిస్ట్ లో మణిరత్నం పేరు కూడా వినిపిస్తుండగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో క్రిష్ పేరు కూడా చేరింది. ఇటీవలే ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తో గ్రాండ్ హిట్ అందుకున్న ఈ విభిన్న చిత్రాల దర్శకుడు ఇటీవలే చెర్రీ కోసం ఓ కథ ను రెడీ చేసి వినిపించాడట. ఈ . డిఫెరెంట్  స్టోరీ చెర్రీ కి బాగా నచ్చడం తో క్రిష్ తో వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడట. అంటే ఈ ఇయర్ తో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా చెర్రీ ఫుల్ బిజీ అన్నమాట..