Ramcharan Gowtam Tinnanuri - మరో మూవీ ప్రకటించిన చరణ్
Friday,October 15,2021 - 01:10 by Z_CLU
Ramcharan Gowtam Tinnanuri Movie Locked
శంకర్ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేసిన రామ్ చరణ్, ఇంకా ఆ సినిమా స్టార్ట్ చేయలేదు. అంతలోనే మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. UV క్రియేషన్స్, NVR సినిమా బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది.
నిజానికి రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమా ఇప్పటిది కాదు. దాదాపు ఏడాదిన్నరగా వీళ్లిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఒక దశలో RRR తర్వాత చరణ్ ఈ సినిమానే ఎనౌన్స్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ శంకర్ ప్రాజెక్టును ప్రకటించాడు చెర్రీ.

దీంతో గౌతమ్ తిన్ననూరి సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తో సినిమా ఉంటుందని ఈమధ్య ప్రకటించిన చరణ్, చెప్పినట్టుగానే ఆ సినిమాను దసరా సందర్భంగా ఈరోజు అఫీషియల్ గా ప్రకటించాడు.
మళ్లీరావా సినిమాతో దర్శకుడిగా అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఆ తర్వాత జెర్సీ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డ్ అందుకుంది ఈ సినిమా. ప్రస్తుతం జెర్సీ మూవీని షాహిత్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఆ సినిమా తర్వాత పూర్తిగా చరణ్ ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టబోతున్నాడు.
అటు చరణ్ కెరీర్ లో ఇది మరో క్లాస్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. గతంలో ఆరెంజ్ లాంటి క్లాస్ మూవీ చేసిన చరణ్, మళ్లీ ఇన్నేళ్లకు గౌతమ్ చెప్పిన స్టోరీకి ఫిదా అయ్యాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics