RRR... నో డౌట్స్, చెప్పిన టైమ్ కే వస్తుంది

Tuesday,January 07,2020 - 03:55 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా RRR. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ మెంట్ రోజునే ప్రకటించారు. ఈ ఏడాది జులై 30న RRR రిలీజ్ అవుతుందన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్స్ పై ఈమధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. చెప్పిన టైమ్ కు సినిమా రాదంటూ పుకార్లు పుట్టించారు కొందరు. దీనిపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యాడు.

“జులై 30న వస్తామని ఎనౌన్స్ చేసిన రోజునే చెప్పాం. అదే పక్కా. సినిమా దాదాపు 65-70 శాతం కంప్లీట్ అయింది. ఇప్పటివరకు అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. రిలీజ్ డేట్ మాత్రం ఇంతకుముందు చెప్పిన తేదీనే.”

ఇలా RRR రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్. న్యూ ఇయర్ లో తన నుంచి కచ్చితంగా 2 సినిమాలు వస్తాయని ప్రకటించిన రామ్ చరణ్.. మరోసారి బాలీవుడ్ కు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టంచేశాడు. ఇకపై కూడా మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నాడు మెగా పవర్ స్టార్.