ఓవర్సీస్ పై చరణ్ ఫోకస్

Monday,November 28,2016 - 10:25 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓవర్సీస్ పై కన్నేశాడు. కంటెంట్ బాగుంటే చాలు, చిన్న సినిమాలు కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కలెక్షన్లలో ఓవర్సీస్ ది కీలకంగా మారింది. అందుకే తన అప్ కమింగ్ మూవీ ధృవకు సంబంధించి ఓవర్సీస్ లో ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించాలని ఫిక్స్ అయ్యాడు చెర్రీ. దీనికి సంబంధించి అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్స్ క్లూజివ్ గా పర్యటించాలని నిర్ణయించాడు. త్వరలోనే చెర్రీ యూఎస్ టూర్ రోడ్ మ్యాప్ సిద్ధమౌతుంది.
cxxtvrvxuaamaxn
మరోవైపు ధృవ విడుదలకు సంబంధించి భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ధృవ సినిమాను విడుదల చేయాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్ణయించారు. దీనికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సినిమా విడుదలకు ముందు ప్లాన్ చేసిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను… గతంలో అనుకున్నట్టు తిరుపతిలో కాకుండా, హైదరాబాద్ లోనే నిర్వహించాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.