నో రెస్ట్.... ఓన్లీ సినిమా...

Tuesday,November 08,2016 - 01:00 by Z_CLU

సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘ధృవ’ తరవాత రామ్ చరణ్, సుకుమార్ సినిమాకి రెడీ అయిపోతాడు ఇది ఫిక్స్. రీసెంట్ గా ‘ధృవ’ ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్, సినిమా సక్సెస్ ఫర్ ష్యూర్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

మరో వైపు గ్రౌండ్ వర్క్ ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయిన సుకుమార్ సినిమా కోసం నాన్ స్టాప్ షెడ్యూల్స్ కి సంతకం చేసేశాడు చెర్రీ. డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా ‘ధృవ’ఇటు రిలీజ్ అవుతుందో లేదో, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా థర్డ్ వీక్ కల్లా సుకుమార్ తో సెట్స్ పైకి వచ్చేస్తాడు చెర్రీ. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.