మణిరత్నంతో చెర్రీ ఫిక్స్...

Friday,December 09,2016 - 09:00 by Z_CLU

ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో లవ్ ఎంటర్టైనర్ సినిమాల ఎక్స్పర్ట్ మణిరత్నం ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా? అనే విషయం పై బాగానే చర్చ జరిగింది కూడా. అయితే ఇప్పుడు ఆ వార్త నిజం చేయబోతున్నాడు చెర్రీ. ఎట్టకేలకి మణిరత్నం తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మెగా పవర్ స్టార్.

mani-rathnam

ప్రెజెంట్ ధృవ లో నటించిన రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జనవరిలో సెట్స్ పై పెట్టబోతున్న చెర్రీ మరో వైపు కొరటాల శివ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి తో మణిరత్నం తో కూడా ఓ సినిమా ఉంటుందని లేటెస్ట్ గా అనౌన్స్ చేసాడు చరణ్. ప్రెజెంట్ ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే మణిరత్నం గారి తో సినిమా చేస్తానని. అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో? మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పాడు చెర్రీ.