Acharya - రామ్ చరణ్ ఎపిసోడ్ హైలెట్ అంట!

Wednesday,April 14,2021 - 05:42 by Z_CLU

ఆచార్య సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టీజర్ తో క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. తాజాగా ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అది కొరటాల మార్క్ యాక్షన్ ఎపిసోడ్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రామ్ చరణ్ పై ప్రస్తుతం రెయిన్ లో ఓ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు యూనిట్. హైదరాబాద్ లో భారీ సెట్ లో ఈ షూట్ జరుగుతుంది. కొందరు ఫైటర్స్ తో కలిసి చరణ్ షూట్ లో పాల్గొంటున్నాడు.

ఇక మెగాస్టార్ చేసే మెగా ఫైట్స్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని సినిమా చూసాక ఫైట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని యూనిట్ చెప్తోంది. కొరటాల తన మొదటి సినిమా నుండే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో సత్తా చాటుతున్నాడు. మిర్చి లో అన్ని ఫైట్లు ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీమంతుడు లో ఇటుక బట్టి దగ్గర ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ తో పాటు మామిడితోటలో ఫైట్ కూడా హైలైట్ అనిపించుకుంది. ఇక జనతా గ్యారేజ్ , భారత అనే నేను లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సారి కొరటాల మెగా హీరోలతో తీస్తున్న ‘ఆచార్య’ లో కూడా అలాంటి అదిరిపోయే గూస్ బంప్స్ ఫైట్స్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల.

వచ్చే నెలలో థియేటర్స్ కి రావాల్సిన ఈ సినిమా కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. త్వరలోనే రిలీజ్ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ , పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics