50 కోట్ల క్లబ్ లోకి ధృవ

Thursday,December 22,2016 - 03:43 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సమయం… టోటల్ మెగాభిమానులంతా కలలుగన్న స్వప్నం… ఎట్టకేలకు ధృవ సినిమాతో సాకారం అయింది. చెర్రీ లేటెస్ట్ మూవీ ధృవ 50కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. బుధవారం నాటి వసూళ్లతో ఈ సినిమా షేర్ 50కోట్ల మార్క్ చేరుకుంది. దీంతో మెగా కాాంపౌండ్ లోనే కాకుండా.. టోటల్ మెగాభిమానుల మదినిండా ఆనందం నిండుకుంది. బాక్సాఫీస్ వద్ద సంబరాలు ప్రారంభమయ్యాయి.

మెగా కాాంపౌండ్ తో పాాటు ఫ్యాన్స్ ఇంతలా సంబరపడ్డానికి కారణం, ధృవ విడుదలైన టైమింగ్. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రతి సినిమాపై పడుతోంది. ఇలాంటి టఫ్ టైమ్స్ లో ధృవ 50కోట్ల క్లబ్ లోకి చేరడం కేవలం చెర్రీకే కాదు… టోటల్ టాలీవుడ్ కే గుడ్ న్యూస్ గా మారింది. రేపు రాబోతున్న సినిమాలకు కూడా స్ఫూర్తిగా నిలిచింది.