రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్

Saturday,February 15,2020 - 12:39 by Z_CLU

టైటిల్ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పటికీ మేటర్ మాత్రం క్లియర్. డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ దక్కించుకున్నట్టు టాక్. కుదిరితే మరో మెగా హీరోతో ఆ సినిమాను రీమేక్ చేయాలనేది చరణ్ ప్లాన్.

మలయాళంలో ఫృధ్వీరాజ్ చేసిన మూవీ డ్రైవింగ్ లైసెన్స్. డిసెంబర్ లో రిలీజైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్టయింది. పాయింట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఓ హీరోకు, అతడ్ని అభిమానించే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే అధికారికి మధ్య జరిగే ఇగో క్లాష్ తో ఈ సినిమాను తీశారు.

ఈ సినిమా చూసిన రామ్ చరణ్ వెంటనే రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. తన సొంత బ్యానర్ పై మరో మెగా హీరోతో ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

ఇప్పటికే కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై లూసిఫర్ అనే మలయాళ సినిమా రైట్స్ దక్కించుకున్నాడు చరణ్. చిరంజీవి హీరోగా ఆ సినిమాను రీమేక్ చేయాలనేది ప్లాన్. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అనే మరో మలయాళ సినిమా రైట్స్ కూడా తీసుకున్నాడు.