ఖైదీతో ధృవ స్టెప్పులు...

Thursday,December 08,2016 - 11:12 by Z_CLU

చిరంజీవి రీఎంట్రీ మూవీ, మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ఖైదీ నంబర్ 150కు…. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఖైదీ నంబర్-150లో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనేదేే ఆ రూమర్. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎట్ లాస్ట్ చెర్రీనే దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఖైదీ సినిమాలో తను కూడాా ఉన్నానని ప్రకటించాడు.

ధృవ సినిమా విడుదల కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన చెర్రీ.. ఖైదీ నంబర్-150లో తను కేవలం ఓ సాంగ్ లో మాత్రం కనిపిస్తానని చెప్పుకొచ్చాడు. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో ఆ పాట షూటింగ్ జరుగుతోందని, ఈరోజుతో ఆ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందని చెర్రీ క్లారిటీ ఇచ్చాడు. అయితే లక్ష్మీరాయ్ తో చేసిన ఐటెంసాంగ్ లో చెర్రీ కనిపిస్తాడా… లేక మరో సాంగ్ లో కనిపించబోతున్నాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.