ట్రెండ్ బ్రేక్ చేస్తున్న చెర్రీ...

Friday,November 11,2016 - 05:10 by Z_CLU

మెగా హీరోల సినిమాలంటే మెగా ఫైట్స్… 6 అదిరిపోయే పాటలతో మెగా ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. దాదాపు మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా అలరించడానికి మెగా హీరోలందరూ ఈ రూట్ నే ఫాలో అవుతున్నారు కూడా. ఇప్పటివరకు 5 ఫైట్లు, 6 పాటల్లేని మెగా మూవీని ఫ్యాన్స్ ఊహించలేదు. అయితే ఈ ట్రెండ్ ను రామ్ చరణ్ బ్రేక్ చేశాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ధ్రువ’ చిత్రంలో కేవలం 4 పాటలు మాత్రమే ఉన్నాయి. కావాలంటే ధృవలో కూడా 6 పాటలు పెట్టుకోవచ్చు. కానీ చెర్రీ మాత్రం అలా చేయలేదు. దీనికి కారణం కేవలం కథ, కథనంపై ఫోకస్ పెట్టడమే. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రకారం… 4 పాటలకే స్కోప్ ఉంది. అందుకే అనవసరంగా ఎక్స్ ట్రా పాటల్ని ఇరికించడం కంటే 4 పాటలతోనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల ధృవ సినిమా మరింత క్రిస్పీగా, పక్కా స్క్రీన్ ప్లేతో అదిరిపోయే లెవెల్లో తయారవుతోందట. ఇలా మెగా కాంపౌండ్ లో ట్రెండ్ ను బ్రేక్ చేశారు చెర్రీ.