అజ‌ర్ బైజాన్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌

Tuesday,September 04,2018 - 12:01 by Z_CLU

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. యూరోప్ లోని అజ‌ర్ బైజాన్‌లో ఇవాళ్టి (సెప్టెంబ‌ర్ 4) నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ “మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే అటు మెగాభిమానులు, ఇటు ప్రేక్ష‌కులు ఎన్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుంటారో తెలిసిందే. అంచ‌నాల‌ను మించేలా సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను పూర్తి చేశాం. ఈరోజు నుంచి అజ‌ర్‌బైజాన్‌లో భారీ ఖ‌ర్చుతో కూడుకున్న కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నాం.

25 రోజ‌ల పాటు జ‌ర‌గ‌బోయే ఈ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌లో రామ్‌చరణ్ తో పాటు వివేక్ ఒబరాయ్, ప్రశాంత్ కూడా పాల్గొంటున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ ప్యాక్డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా వస్తోంది.

రామ్‌చరణ్‌, కియ‌రా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి..
మాటలు: ఎం.రత్నం
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కెమెరామెన్‌: రిషి పంజాబీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్
నిర్మాత : దానయ్య డి.వి.వి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను