చెర్రీ బర్త్ డే గిఫ్ట్: 2 ఇంట్రెస్టింగ్ పోస్టర్లు

Tuesday,March 27,2018 - 01:31 by Z_CLU

ఈరోజు రామ్ చరణ్ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఓవైపు అభిమానులు రక్తదానంతో తమ అభిమానాన్ని చాటుకుంటుంటే, మరోవైపు సెలబ్రిటీలంతా ట్వీట్స్ తో ముంచెత్తుతున్నారు. ఇక చెర్రీకి సంబంధించిన 2 సినిమాల హడావుడి కూడా షురూ అయింది.

చరణ్ బర్త్ డే సందర్భంగా రంగస్థలం సినిమా నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేసారు. పాత కాలానికి చెందిన ఓ బండిపై చరణ్ కూర్చున్న స్టిల్ ను విడుదల చేశారు. దీంతో పాటు బోయపాటి సినిమాకు సంబంధించి కూడా హ్యాపీ బర్త్ డే పోస్టర్ రిలీజైంది.

స్టయిలిష్ గా ఉన్న చరణ్ ఫొటోను రిలీజ్ చేశారు. బోయపాటి సినిమాలో చెర్రీ ఎలా కనిపించబోతున్నాడో ఈ స్టిల్ తో ఓ క్లారిటీ వచ్చింది. ఇది ఫస్ట్ లుక్ కానప్పటికీ.. దాదాపు ఇదే లుక్ లో బోయపాటి సినిమాలో కనిపించబోతున్నాడు రామ్ చరణ్.