Acharya - రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

Thursday,November 26,2020 - 02:14 by Z_CLU

ChiranjeeviKoratala కాంబినేషన్ లో తెరకెక్కుతున్న Acharya కి లైన్ క్లియర్ అయింది. సినిమాలో ఉన్న కీ రోల్ ని రామ్ చరణ్ చేస్తాడా లేదా అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ స్పెషల్ రోల్ ను చరణ్ తోనే చేయించాలని డిసైడ్ అయిన కొరటాల.. ఎట్టకేలకు ఆ ఎపిసోడ్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

నిజానికి రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా చేయడానికి రాజమౌళి పర్మిషన్ కావాలి. RRR రిలీజ్ కాకుండా చరణ్ మరో సినిమా చేయడానికి వీల్లేదు. కానీ తాజాగా చరణ్ రాజమౌళితో డిస్కస్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఆ వెంటనే ఆచార్య షూట్ కు కాల్షీట్లు కేటాయించాడు.

ఆచార్యకు సంబంధించి ప్రస్తుతం సోనూ సూద్, తనికెళ్ళ భరణి మిగతా నటులపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నాడు కొరటాల. త్వరలోనే చిరు ఈ సినిమా షూటింగ్ పాల్గొనబోతున్నారు.

ఇక చరణ్ పార్ట్ షూట్ ను డిసెంబర్ లో ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ షెడ్యుల్ కి సంబంధించి వర్క్ మొదలైంది. చరణ్ కాస్ట్యూమ్ , లుక్ మీద టీం వర్క్ చేస్తున్నారు. మరి ‘ఆచార్య’లో చరణ్ ఎలా కనిపిస్తాడు..? అసలు చిరంజీవితో సన్నివేశాలు ఉంటాయా ? అనేవి తెలియాల్సి ఉంది.

Also  Check – సంక్రాంతిని మిస్ చేసిన చిరు