శ్రీహరి గొప్పదనం చెప్పిన చరణ్!

Saturday,August 01,2020 - 12:56 by Z_CLU

రామ్ చరణ్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ విడుదలై నిన్నటికి పదకొండేళ్ళయింది. ఈ సందర్భంగా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన రియల్ స్టార్ డా. శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చరణ్ ఫ్యాన్స్ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఆ వీడియోలో రామ్ చరణ్ పాత ఇంటర్వ్యూ లో శ్రీహరి గారి గురించి విషయాన్ని పొందుపరిచారు.

శ్రీహరి గారితో వర్క్ చేయడం తన ఫ్యామిలీలో వ్యక్తితో వర్క్ చేసినట్టుందని తెలిపాడు చరణ్. అంతే కాదు షూటింగ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ జరిగే సమయంలో శ్రీహరి గారు దగ్గరుండి స్టంట్ మాస్టర్స్ తో ప్రత్యేకంగా మాట్లాడి, అలాగే అక్కడ వాడే రోప్స్ ను పరిశీలించేవారని, మీరు మరీ ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు… నేను చూసుకుంటా అంటే లేదు నేను ఇక్కడున్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి లేదంటే మీ నాన్నకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుందని నవ్వుతూ అనేవారని చెప్పుకొచ్చాడు చరణ్.

ఇలా ‘మగధీర’ సినిమా రిలీజ్ డేట్ ను గుర్తుచేస్తూ చరణ్ ఫాన్స్ వదిలిన ఈ వీడియో మరోసారి శ్రీహరి గారిని గుర్తుచేసింది.