Ramarao On Duty - ట్రయిలర్ రివ్యూ

Sunday,July 17,2022 - 09:45 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

హైదరాబద్ లో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అభిమానుల కోలాహలం మధ్య బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు శరత్ మండవ, దివ్యాంశ కౌశిక్, నాజర్, సుదీర్ వర్మ, త్రినాథ రావ్ నక్కిన, వంశీ, కళ్యాణ్ చక్రవర్తి, సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

”ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను..ఇక పై రామారావు గా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను” అని మాస్ మహారాజా రవితేజ చెప్పిన డైలాగ్ తో మొదలై ట్రైలర్.. ఆద్యంతం యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బ్రిలియంట్ గా సాగింది. ట్రైలర్ బిగినింగ్ లో ఒక ఆపరేషన్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం.. ”మా నాన్నని వెదకడానికి హెల్ప్ చేస్తారా ?” అని ఓ పాప ప్రాధేయపడగా… రామారావు గా రవితేజ ఎంట్రీ మెస్మరైజింగ్ గా అనిపించింది. ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు, రవితేజ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

ముఖ్యంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథపై ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచేసింది. ఒక ప్రాంతంలోని వ్యక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఆ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు? ఈ మిస్టరీని రామారావు ఎలా చేధిస్తాడనేది ట్రైలర్ లో చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. ”కనిపించకుండాపోయింది ఒక్కరో ఇద్దరో కాదు” అని రామారావు చెప్పడం మరింత థ్రిల్, సస్పెన్స్ ని యాడ్ చేసింది. ట్రైలర్‌లో సినిమాకు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ ని చాలా ఇంట్రెస్టింగా ప్రజంట్ చేశారు. బలమైన కథ, కథనం, పాత్రలు,ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఉనాయి.

రవితేజ నిజాయితీ ధైర్యంగల గవర్నమెంట్ ఆఫీసర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా, రొమాంటిక్ గాయ్ గా, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అన్ని కోణాల్లో ఒదిగిపోయాడు. పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన వేణు తొట్టెంపూడి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.