Ramarao On Duty - ఫస్ట్ వీక్ కలెక్షన్

Monday,August 01,2022 - 03:12 by Z_CLU

Ramarao On Duty First Week Collection

రవితేజ హీరోగా నటించిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ మాస్ రాజా నటించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 8 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

సుధాకర్ చెరుకూరి నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, డిప్యూటీ కలెక్టర్ గా కనిపించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా.. రజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు ఏపీ,నైజాంలో మొదటి వారాంతం (3 రోజుల్లో) వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – 1.21 కోట్లు
సీడెడ్ – 64 లక్షలు
ఉత్తరాంధ్ర – 54 లక్షలు
ఈస్ట్ – 37 లక్షలు
వెస్ట్ – 20 లక్షలు
గుంటూరు – 31 లక్షలు
నెల్లూరు – 15 లక్షలు
కృష్ణా – 23 లక్షలు