మహేష్ సెంటిమెంట్ తో రామ్...

Wednesday,September 21,2016 - 09:00 by Z_CLU

రామ్ తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘హైపర్’. ఈ సినిమా విషయం లో రామ్ మహేష్ సెంటి మెంట్ ఫాలో అవుతున్నాడు. మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రం ‘దూకుడు’. ఈ సినిమా సెప్టెంబర్ 23 న విడుదలై మహేష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతోనే మహేష్ విజయ పరంపర మొదలైంది. అందుకే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే అంటే సెప్టెంబర్ 23 నే రామ్ కూడా తన ‘హైపర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సినిమాలోని పాటలను విడుదల చేయబోతున్నాడు.

        ఈ సెంటిమెంట్ వెనక మరో రీజన్ కూడా ఉంది. దూకుడు సినిమా నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైనే ‘హైపర్’ కూడా తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలకు ఒకరే నిర్మాత కావడంతో తమ బ్యానర్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఈ తేదీనే తమ తాజా సినిమా ప్రమోషన్ కు కూడా ఫిక్స్ చేశారు నిర్మాతలు.