Ram RED - రిలీజ్ డేట్ ఫిక్స్

Sunday,December 27,2020 - 09:16 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘RED‘ సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో RAM సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు.

ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. ‘దేవదాసు’, ‘మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో… ఈ అంశాలన్నీ సినిమాలో ఉంటాయంటున్నారు నిర్మాత రవికిషోర్.

‘ఇస్మార్ట్ శంకర్’కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, ‘రెడ్’కి కూడా సంగీతం అందించారు. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే రెడ్ టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూసింది. ఇప్పుడు సంక్రాంతికి థియేటర్లలోకి వస్తోంది.

Also Check – RED మూవీ స్టిల్స్