పెళ్లిపై రియాక్ట్ అయిన రామ్

Saturday,May 16,2020 - 01:44 by Z_CLU

టాలీవుడ్ లో ఇప్పుడు హీరోల పెళ్లిళ్లపై జోరుగా డిస్కషన్ సాగుతోంది. దీనికి కారణం వరుసగా హీరోయింతా పెళ్లి పీటలు ఎక్కుతుండడమే. దీంతో సహజంగానే రామ్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి రామ్ ఇచ్చిన రిప్లయ్ ఏంటో మీరే చూడండి.

“ప్రస్తుతానికి ఇలా సింగిల్ గా ఉంటేనే బాగుందనిపిస్తోంది. అయినా ప్రేమ-పెళ్లి లాంటివి మన చేతుల్లో ఉండవు కదా. కాబట్టి అవన్నీ జరగాల్సిన సమయం వస్తే జరిగిపోతాయి.”

ఇలా సింపుల్ గా రియాక్ట్ అయ్యాడు రామ్. ఎనర్జిటిక్ స్టార్ చెప్పిన ఆన్సర్ బట్టి చూస్తుంటే.. ప్రస్తుతం ఈ హీరో ఎలాంటి రిలేషన్ షిప్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. పైగా ప్రేమ-పెళ్లి తన చేతిలో లేవంటున్నాడంటే.. తన పెళ్లి వ్యవహారాన్ని పూర్తిగా పెద్దలకు అప్పగించి ఉండొచ్చు.

ప్రస్తుతం రెడ్ సినిమాపైనే పూర్తిగా దృష్టిపెట్టాడు రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించి ఓ మాస్ నంబర్ కూడా రిలీజ్ చేశారు. లాక్ డౌన్ ముగిసి, థియేటర్లు తెరుచుకున్న వెంటనే రెడ్ మూవీ రిలీజ్ అవుతుంది.