దిమాక్ ఖరాబ్ పై రామ్ రియాక్షన్

Tuesday,June 11,2019 - 05:38 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన దిమాక్ ఖరాబ్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. సూపర్ హిట్ అయిన ఈ సాంగ్ పై హీరో రామ్ రియాక్ట్ అయ్యాడు. ఆ పాట వెనకున్న సంగతుల్ని పంచుకున్నాడు.

దిమాక్ ఖరాబ్ అనే సాంగ్ ఓ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ లో వస్తుంది. కథ తెలిసిన తర్వాత పాటను ఇంకా ఎంజాయ్ చేస్తారు
– నిధి, నభా ఇద్దరూ బాగా డాన్స్ చేశారు. నిధి ముందు నుంచి మంచి డాన్సర్. నభా బాగా నేర్చుకుంది
నా మైండ్ లో వచ్చిన మొదటి పేరు మణిశర్మ, పూరి మైండ్ లో కూడా అదే పేరు ఉంది. అలా సెట్ అయిపోయింది.
– దిమాక్ ఖరాబ్ సాంగ్ కు శేఖర్ మాస్టర్ స్టెప్స్ ఇరగదీశారు.
పూరితో వర్క్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందా అని ఎప్పుడూ అనుకుంటాను. పూరి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హీరోకు యూటిట్యూడ్ స్టార్ట్ చేసిన వ్యక్తి పూరి.
– ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎలా చేస్తానో తెలీదు కానీ వెంటనే ఓకే మాత్రం చెప్పేశాను.

https://twitter.com/PuriConnects/status/1138410959402221575