సెట్స్ పైకి దారేది...?

Saturday,November 12,2016 - 08:00 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న రామ్ నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టాడు. మొన్నటివరకూ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ బ్లైండ్ క్యారెక్టర్ తో సినిమా చేయడానికి రామ్ రెడీ అయ్యాడనే టాక్ వినిపించగా… ఆ సినిమా ఇప్పుడే ఉండదంటూ ప్రకటించేశాడు. ఇక రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త కూడా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

    అయితే తాజా సమాచారం ప్రకారం… రామ్-పూరి సినిమా కూడా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే… హైపర్ తర్వాత తన నెక్ట్స్ మూవీగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్. ఆ మూవీ తర్వాత… నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమలతో ఇంకో సినిమా చేయబోతున్నాడు. వీళ్లిద్దరితో సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే పూరి జగన్, అనిల్ రావిపూడి సినిమాల గురించి ఆలోచిస్తాడట రామ్.