Ram Pothineni గౌతం మీనన్ తో రామ్ సినిమా

Thursday,September 15,2022 - 03:55 by Z_CLU

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు హీరో రామ్. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ కాంబోకి సంబంధించి ప్రాజెక్ట్ లాక్ అయింది. స్రవంతి రవి కిషోర్ నిర్మాణంలో స్రవంతి మూవీస్ బేనర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. గౌతం మీనన్ ప్రస్తుతం రామ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇటివల కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ ‘ది వారియర్’ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ కూడా మరో కోలీవుడ్ డైరెక్టర్ ని లాక్ చేసుకొని ఇంకో బైలింగ్వెల్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్. బోయపాటి-రామ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే  రామ్ -గౌతం మీనన్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. తాజాగా శింబు తో గౌతం మీనన్ తీసిన సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ క్రమంలో రామ్ తో గౌతం మీనన్ నెక్స్ట్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.