రీమేక్ తో రెడీ అవుతున్న రామ్ !

Monday,September 09,2019 - 12:59 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. తమిళ్ లో హిట్టైన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు ఎనర్జిటిక్ స్టార్. మొన్నటి వరకూ రామ్ ఈ రీమేక్ చేయట్లేదనే వార్తలొచ్చాయి. ప్రస్తుతం అందిన సమాచారం మేరకూ రామ్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదేనట.

ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ దర్శకుడితో రెండు సినిమాలు చేసాడు రామ్. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడు సినిమా. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిషోర్ నిర్మించనున్న ఈ క్రైం థ్రిల్లర్ సినిమా దసరాకి ప్రారంభం కానుందని తెలుస్తుంది.