రామ్ సినిమాకు టైటిల్ ఇదేనా ?

Thursday,January 03,2019 - 08:05 by Z_CLU

రామ్- పూరి జగన్నాథ్ సినిమా టైటిల్ ఏంటి …? టాలీవుడ్ లో ఇప్పుడిదే ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్.. ఈ ఏడాది మోస్ట్ ఎవైటింగ్ కాంబోలో ఇదొకటి. రామ్ తో పూరి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా టైటిల్ పై చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు సాయత్రం టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఎప్పటి నుండో ‘పండుగాడు’ అనే టైటిల్ చక్కర్లు కొడుతుంది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు ‘ఇస్మార్ట్ శంకర్’ అనే డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేసారని తెలుస్తోంది.. ఈ టైటిల్ కి సంబంధించి రామ్ ఇప్పటికే తన ట్వీట్స్ ద్వారా క్లూ కూడా ఇచ్చాడు. మరి రామ్ -పూరి ఈ రోజు సాయంత్రం ఈ టైటిల్ నే అనౌన్స్ చేస్తారా… చూడాలి.

ఈ సినిమాతో ఇప్పటి వరకూ చూడని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో రామ్ ని ప్రెజెంట్ చేయబోతున్నాడు పూరి. ఎస్పెషల్లీ రామ్ లుక్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అందుకే పండగలు పబ్బాలు పట్టించుకోకుండా మాస్ లుక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు రామ్. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ , ఛార్మీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది. సమ్మర్ స్పెషల్ గా మే లో సినిమా రిలీజ్ కానుంది.