రామ్ చేతిలో తమిళ్ రీమేక్ !

Sunday,June 16,2019 - 03:32 by Z_CLU

ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న రామ్ నెక్స్ట్ ఓ రీమేక్ సినిమా చేయబోతున్నాడు. తమిళ్ లో ఈ ఏడాది విడుదలైన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు రామ్. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ ను పెదనాన్న స్రవంతి రవి కిషోర్ తో కొనుగోలు కూడా చేయించాడట.

మగిళ్ తిరుమేని డైరెక్షన్  అరుణ్ విజయ్ నటించిన ‘తడం’ తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ మెన్ గా కనిపించాడు. ఇప్పుడు అదే క్యారెక్టర్ ను రామ్ చేయబోతున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను కొన్ని మార్పులతో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట రామ్. ప్రస్తుతానికి తన కంప్లీట్ ఫోకస్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మీదే పెట్టిన ఎనర్జిటిక్ హీరో ఆ సినిమా రిలీజయ్యాకే ఈ రీమేక్  వర్క్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాను రామ్, స్రవంతి రవి కిషోర్ లు ఏ దర్శకుడి చేతిలో పెడతారో..చూడాలి.