రామ్ కొత్త సినిమా - అడ్వెంచరస్ ఎంటర్ టైనర్

Thursday,April 26,2018 - 02:49 by Z_CLU

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కనుంది రామ్ కొత్త సినిమా. ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రస్తుతం త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న రామ్, మే 7 నుండి ఈ సినిమా సెట్స్ పైకి రానున్నాడు.

రీసెంట్ గా ‘గరుడవేగ’ సినిమాతో ఇంప్రెస్ చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు రామ్ ని ఈ సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జార్జియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఫిల్మ్ మేకర్స్ , ఫస్ట్ షెడ్యూల్ జార్జియా లో ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ ని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.