భారీ స్థాయిలో రామ్ కొత్త సినిమా

Thursday,May 10,2018 - 07:18 by Z_CLU

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కనుంది రామ్ నెక్స్ట్ సినిమా. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.

సినిమాని మ్యాగ్జిమం జార్జియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాల్లో తెరకెక్కించనున్న ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా సాంగ్స్ తో పాటు BGM ని లండన్ లో కంపోజ్ చేయనున్నారు. ఆల్రెడీ ఈ సినిమా సాంగ్స్ కంపోజ్  చేయడం బిగిన్ చేసిన మిక్కీ జె. మేయర్,  హండ్రెడ్ పీస్ ఆర్కెస్ట్రాతో ఈ సినిమా సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నట్టు కన్ఫమ్ చేశాడు.

 

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుందనే టాక్ వినిపిస్తున్నా, ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ కాలేదు.