#Rapo19 - సెట్స్ పైకొచ్చిన క్రేజీ కాంబో!

Monday,July 12,2021 - 02:13 by Z_CLU

Ram Pothineni Lingusami Movie Regular Shoot Begins

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు రామ్. #Rapo19 అంటూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుండి హైదరాబాద్ లో మొదలైంది. గండిపేటలో ప్రస్తుతం రామ్ మిగతా నటీ నటులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు. లింగుస్వామి స్టైల్ ఆఫ్ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ లుక్ , క్యారెక్టర్ మాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా విపరీతంగా మెప్పిస్తాయని ఇన్సైడ్ టాక్.

Ram pothineni new stills zeecinemalu

సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే రామ్ , హీరోయిన్ కృతిలపై ఓ ఫోటో షూట్ చేశారు. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ని లింగుస్వామి బాగా రాసుకున్నాడని సమాచారం. రామ్ తో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా మంచి స్కోప్ ఉంటుందని తెలుస్తుంది. అందుకే హీరోయిన్ రోల్ కి బిజీగా ఉన్నప్పటికీ గట్టిగా ట్రై చేసి కృతి డేట్స్ తీసుకున్నారట.

Krithi Shetty new stills zeecinemalu

కృతి షెట్టి

శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ , రెడ్ వంటి మాస్ సినిమాల తర్వాత రామ్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా కోలీవుడ్ లో లింగుస్వామి యాక్షన్ డైరెక్టర్ అనే పేరుంది. అతను డైరెక్ట్ చేసిన పందెం కోడి సినిమా డబ్బింగ్ గా సినిమాగా రిలీజై తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి లింగుస్వామి రామ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడు ? ఈ స్ట్రైట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics