ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Sunday,May 12,2019 - 12:06 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ రిలీజ్ కి రెడీ అయింది. మరో 2 రోజుల్లో రామ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో రోలీజ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇపటి వరకు జస్ట్ ఫస్ట్ లుక్ దానికి తోడు షూటింగ్ అప్డేట్స్ తో
ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ రేజ్ చేసిన మేకర్స్, ఈ టీజర్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా టాకీపార్ట్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక మిగిలింది ఈ సినిమాలోని సాంగ్స్ షూట్ చేసుకోవడమే. ఇంకా ఎన్ని సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయనేది ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు కానీ, ఈ సాంగ్స్ ని తెరకెక్కించడానికి త్వరలో యూరోప్ బయలుదేరనుంది
ఇస్మార్ట్ శంకర్ టీమ్.

ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నభా నతేష్, నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు.