ఇస్మార్ట్ శంకర్ ‘ఎట్రాక్షన్స్’

Wednesday,July 17,2019 - 10:02 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’… సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే డిస్కర్షన్స్ నడుస్తున్నాయి. ఈ సినిమాపై ఈ స్థాయిలో బజ్ పెరగేలా చేస్తున్న మెయిన్ ఎట్రాక్షన్స్ ఇవే…

రామ్ మాసివ్ అవతార్ : పూరి మార్క్ హీరోకి… మరో లెవెల్ లో కనిపిస్తున్నాడు రామ్ ఈ సినిమాలో. కరియర్ లోనే ఫస్ట్ టైమ్ బ్యాడ్ బాయ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. కాస్ట్యూమ్స్ దగ్గర నుండి బాడీ లాంగ్వేజ్, యాస వరకు.. రామ్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే అనిపించేంతగాఎట్రాక్ట్ చేస్తున్నాడు రామ్.

 

పూరి జగన్నాథ్ : పూరి  సినిమా అంటేనే బ్రాండ్.. హీరోని డిఫెరెంట్ గా చూపిస్తాడు.. అదొకటేనా.. పూరి డైలాగ్స్ కి కూడా ఫ్యాన్స్ లో భారీ క్రేజ్ ఉంది. అది కాస్త ఈ సినిమా వరకు వచ్చేసరికి తెలంగాణ యాసలో, పూరి మాసిజం మరింత ఎలివేట్ అవుతుంది. పూరి రాసుకున్న కథ దగ్గరి నుండి సినిమాలో ఉండబోయే యాక్షన్ సీక్వెన్సెస్ వరకు ప్రతీది ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

 

నభా నతేష్ & నిధి అగర్వాల్ : ఇప్పటికే ఈ ఇద్దరు సినిమా ప్రోమోలతో సోషల్ మీడియాలో హీట్ జెనెరేట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఇద్దరికిద్దరూ మాస్ హీరోయిన్స్ గా ఎస్టాబ్లిష్ కానున్నారు… ఇప్పటివరకు ట్రైలర్స్ లో చూసింది జస్ట్ స్యాంపిల్ అయితే.. అసలు షో. రేపు థియేటర్స్ లో బిగిన్ కానుంది.

 

 

సాంగ్స్ : మణిశర్మ  కంపోజ్ చేసిన పాటలు .. మాస్ లో ఇప్పటికే రీచ్ అయ్యాయి.. ఇక మిగిలింది వాటి కలర్ ఫుల్ విజువలైషన్… బోనాలు సాంగ్ దగ్గరి నుండి ‘ఉండిపో…’ సాంగ్స్ వరకు ప్రతీది ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటి ఎక్స్ పీరియన్స్ నివ్వబోతున్నాయి.

 

యాక్షన్ సీక్వెన్సెస్ :  రియల్ సతీష్ కంపోజ్ చేసిన ఫైట్స్.. సినిమాలో రామ్ ఎనర్జీ లెవెల్స్ ని  మరింత ఎలివేట్ చేయబోతున్నాయి. మరీ ముఖ్యంగా వారణాసిలోని యాక్షన్ సీక్వెన్సెస్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ : పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాని. సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు పెట్టారన్నది, ఇప్పటికే రిలీజైన విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆడియెన్స్ కి  ఈ స్థాయిలో కనెక్ట్ అవ్వడానికి ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఒక రీజనే.