మరోసారి జోడీ కట్టనున్న రామ్, కాజల్ అగర్వాల్

Tuesday,March 20,2018 - 07:02 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్, కాజల్ అగర్వాల్ మరోసారి జోడీ కట్టనున్నారు. గతంలో ‘గణేష్- జస్ట్ గణేష్’ సినిమాలో జంటగా నటించి ఇంప్రెస్ చేసిన ఈ జోడీ మరోసారి కలిసి నటించనున్నారు. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు డైరెక్టర్.

ప్రస్తుతం త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో నటిస్తున్న రామ్, ఈ సినిమాకు ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తుంది.  ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఫాస్ట్ పేజ్ లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసే  ప్రాసెస్  లో  ఉన్నారనే  టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

రీసెంట్ గా రాజశేఖర్ ‘గరుడవేగ’ సినిమాతో ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ సత్తారు ఈ సారి కూడా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అయితే ఈ సినిమా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.