ఎనర్జిటిక్ స్టార్ నెక్స్ట్ డైరెక్టర్

Thursday,February 02,2017 - 11:27 by Z_CLU

టాలీవుడ్ లో మ్యాగ్జిమం స్టార్స్ ఆన్ సెట్స్ ఉన్నారు. ఒక్క ఎనర్జిటిక్ స్టార్ తప్ప. నేను శైలజ లాంటి డీసెంట్ హిట్ తరవాత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన రామ్, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ఇంకా అనౌన్స్ చేయకపోయినా, చిన్న ట్వీట్ అండ్ అవుట్ స్టాండింగ్ లుక్ తో ఫ్యాన్స్ ని టెంపరరీగా రిలాక్స్ చేశాడు.

రామ్ షేర్ చేసిన ఈ లుక్ ఏ సినిమా కోసమో, ఏ డైరెక్టర్ తో చేయబోయే సినిమా కోసమో క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ, తన నెక్స్ట్ సినిమా కోసం  24/7 పని చేస్తున్నానని అప్ డేట్ చేశాడు. ఈ డిస్కషన్స్ ఓ స్టేజ్ కి వచ్చీ రాగానే, ఓ ఎనర్జిటిక్ అనౌన్స్ మెంట్ తో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ చేయనున్నాడు రామ్.

ram-puri-movie-zee-cinemalu

ఎనర్జిటిక్ స్టార్ నెక్స్ట్ సినిమా డిస్కషన్స్ లో బిజీగా ఉంటే, ఫ్యాన్స్ మాత్రం నెక్స్ట్ డైరెక్టర్ ఎవరై ఉంటారా అనే డీప్ డిస్కషన్స్ లో ఉన్నారు. కాసేపు ఈ డిస్కషన్స్ ని సైడ్ కి నెట్టి టాలీవుడ్ టాక్ వైపు ఓ చెవి పడేస్తే, మ్యాగ్జిమం పూరి డైరెక్షన్ లోనే రామ్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందనే హాట్ టాపిక్ నడుస్తుంది. ఎంత హాట్ టాపిక్ అయినా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కాబట్టి అప్పటి వరకు ఎనర్జిటిక్ గా వెయిట్ చేయడమే బెటర్.