రామ్ కొత్త సినిమా అప్ డేట్స్

Friday,June 16,2017 - 04:18 by Z_CLU

సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ క్యూట్ రొమాంటిక్ స్టోరీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ఓ రేంజ్ లో మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. వైజాగ్ లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెలాఖరు నుంచి విశాఖ, అరకు ప్రాంతాల్లో రామ్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్  ప్రారంభమౌతుంది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల మధ్య మరిన్ని సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఇంతకుముందు నేను శైలజ సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయింది. దీంతో తాజా ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయాయి. నేను శైలజ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్, ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.