సరికొత్త లుక్ దేని కోసం ?

Tuesday,January 24,2017 - 06:04 by Z_CLU

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్టైలిష్ లుక్ కోసం కసరత్తులు చేస్తూ బిజీ గా గడుపుతున్నాడు. ‘హైపర్’ రిలీజ్ అయి చాలా నెలలే కావొస్తున్నా ఇంత వరకూ తన నెక్స్ట్ సినిమా పై ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న రామ్ తన నెక్స్ట్ సినిమాను ఎవరితో? చేయబోతున్నాడనేది ప్రెజెంట్ టాలీవుడ్ లో  హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకూ అనిల్ రావి పూడి తో  ఓ సినిమా ప్లాన్ చేసుకున్న రామ్ ఆ సినిమా నుంచి సడెన్ గా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా కరుణ కరణ్, ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల వంటి డైరెక్టర్స్ రామ్ కు కథలు వినిపించినట్లు సమాచారం.

ram
ఇక ఇప్పటి వరకూ కనిపించని సరి కొత్త లుక్ లో కనిపించాలని ఆరాటపడుతూ భారీ గడ్డం పెంచేసి సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేస్తున్న రామ్ ఇవన్నీ ఏ సినిమా కోసం చేస్తున్నాడు ? ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో అయినా యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడా? లేదా మరో పెద్ద డైరెక్టర్ తో యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడా? అనే డౌట్  క్లారిఫై అవ్వాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే…