Ram Lingusamy Movie - షూటింగ్ అప్ డేట్స్

Wednesday,June 23,2021 - 02:21 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మాస్ యాక్షన్ హీరో అవతారమెత్తిన హీరో రామ్ నెక్స్ట్ లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే #RaPo19 పేరుతో ఎనౌన్స్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జులై రెండో వారం నుండి ఓ యాక్షన్ ఎపిసోడ్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నారని సమాచారం. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతో రామ్ ప్రస్తుతం ఫిజిక్ కోసం వర్కౌట్స్ చేస్తున్నాడట.

Ram pothineni new stills zeecinemalu

                              రామ్ పోతినేని

సినిమాలో రామ్ కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పిస్తాడని ఇన్సైడ్ టాక్. రామ్ క్యారెక్టర్ ని డిఫరెంట్ డిజైన్ చేశాడట లింగుస్వామి. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు ఆ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో రామ్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Krithi Shetty new stills zeecinemalu

     కృతి షెట్టి

మరి #RaPo19 రామ్ లుక్ ఎలా ఉండబోతుంది ? యాక్షన్ ఎపిసోడ్స్ లో రామ్ ఎలా కనిపిస్తాడనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి రానుందని సమాచారం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics