రానా పెళ్లిపై రామ్ జోక్స్ ...

Wednesday,December 14,2016 - 05:09 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా. ఈ 6 అడుగుల అందగాడు ఎవర్ని పెళ్లాడతాడా..ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ రానా మాత్రం ప్రస్తుతం సినిమాలే లోకంగా బతికేస్తున్నాడు. అయితే రానా పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి, అతడి పెళ్లి ప్రస్తావన ఏదో ఒక రూపంలో వస్తుంటుంది. ఈరోజు రానా పుట్టినరోజు. మరి అతడి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరో తెలుసా.. మన హీరో రామ్. ఇతడికి కూడా పెళ్లి కాలేదు. కానీ రామ్ పెళ్లిపై జోక్ మాత్రం వేశాడు. రానా బర్త్ డే సందర్బంగా హ్యాపీ బర్త్ డే గుడ్ ఫ్రెండ్ & సూపర్ హోస్ట్ రానా దగ్గుబాటి అని ట్వీట్ చేశాడు రామ్. ‘పెళ్ళెప్పుడు అని అడగలేను కానీ పార్టీ ఎప్పుడో చెప్పు’ అని సరదాగా ట్వీట్ చేశాడు.

ram-tweet

‘బాహుబలి’ తో బిగ్ స్టార్ ఇమేజ్ అందుకున్న రానా… టాలీవుడ్ లో ఆల్ మోస్ట్ అందరి హీరోలతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడనే సంగతి తెలిసిందే. కేవలం హీరోలతోనే కాదు హీరోయిన్స్ తో కూడా రానా చాలా ఫ్రెండ్లీ గా మూవ్ అవుతుంటాడు. ఎన్నో ఆడియో ఫంక్షన్లలో మనం చూశాం కూడా. అందుకే రానాతో అంతా చాలా చనువుగా ఉంటారు. సరదాగా జోక్స్ కూడా వేస్తుంటారు. ఇప్పుడు రామ్ కూడా అదే పనిచేశాడు. పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు. ముందు పార్టీ ఇచ్చేయ్ బ్రో అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.