రామ్ పోతినేని – గతంలో కన్నా గొప్పగా…

Saturday,July 13,2019 - 10:02 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాని ఆల్రెడీ చూసేశాడు రామ్.  ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. రామ్ తన సినిమా విషయంలో ఇంత నమ్మకంగా ఉండటం ఇదే ఫస్ట్ టైమ్.

సాధారణంగా మినిమం గ్యారంటీ కథల్ని ఎంచుకుంటాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. మహా అయితే కథలో ఓ క్యూట్ లవ్ స్టోరీ.. చుట్టూరా కలర్ ఫుల్ ఫ్యామిలీ.. ఇక్కడ పడాల్సిందే అనిపించే సిచ్యువేషన్స్ లో ఓ 2 ఫైట్స్… కానీ ఇస్మార్ట్ శంకర్… చాలా వేరు…

ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా రామ్ కరియర్ లో పేద ప్రయోగమే. గతంలో మాస్ హీరోలా రామ కనిపించలేదా..? అంటే కనిపించాడు… కానీ ఈ లెవెల్ లో మాత్రం కాదు. అసలు రామ పూరి మార్క్ హీరో అనిపించుకోగలడా..? అనే క్వశ్చన్ కి ఇప్పటికే రిలీజైన 2 ట్రైలర్స్ సమాధానం అయితే.. త్వరలో రిలీజ్ కానున్న సినిమా రామ్ రియల్ స్టామినాని ఎలివేట్ చేయనుంది.

రామ్ లోని సరికొత్త ఆంగిల్ ఇస్మార్ట్ శంకర్ లో చూడబోతున్నాం. గతంలోని సినిమాల కన్నా గొప్పగా ఈ సినిమాలో రామ్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు పూరి…