రామ్‌ 'హైపర్‌' ఫస్ట్‌ లుక్‌ 

Wednesday,August 03,2016 - 11:32 by Z_CLU

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌,  సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను  విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ‘హైపర్‌’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఆగస్ట్‌ 5 నుండి వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ జరుగుతుంది. ఆగస్ట్‌ 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో టోటల్‌ టాకీ పార్ట్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్‌ రెండో వారంలోనే ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ – ”హైపర్‌ అనే టైటిల్‌ రామ్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ సూట్‌ అవుతుంది. సినిమాలోని క్యారెక్టర్‌ కూడా అతని ఎనర్జీకి తగ్గట్టుగానే పవర్‌ఫుల్‌గా వుంటుంది. యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఈ చిత్రంలో వుంటుంది. ఒక మంచి ఎనర్జీ వున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హైపర్‌” అన్నారు.
 రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.