రామ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Wednesday,September 28,2016 - 04:36 by Z_CLU

 

ఇటీవలే ‘నేను శైలజ’ తో మంచి విజయం అందుకున్న రామ్ మరో సూపర్ హిట్ పై కన్నేశాడు. తనకు ‘కందిరీగ’ వంటి సూపర్ హిట్ అందించిన సంతోష్ శ్రీనివాస్ తో ‘హైపర్’ గా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సంగతుల్ని ప్రత్యేకంగా డిజిటల్ మీడియాతో పంచుకున్నాడు.

 అలా చేస్తే తప్పేంటి?

వరుసగా కమర్షియల్ కథలే ఎంచుకోవడానికి కారణం ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలే ఎక్కువగా ఎంజాయ్ చెయ్యడమే. అందుకే వరుసగా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా. మధ్యలో ‘నేను శైలజ’ వంటి ఫుల్ లెంగ్త్ ప్రేమ కథా చిత్రం కూడా చేశాను. ఆ సినిమా తో మంచి విజయం అందుకోవడం సంతోషంగా ఉంది. అయినా ప్రేక్షకులను బాగా అలరించే కమర్షియల్ సినిమాలు చేస్తే తప్పేంటి… ?

_iva18650014

 అంతా నాన్నే చేశారు…

సంతోష్ శ్రీనివాస్ ఈ కథ చెప్ప గానే కనెక్ట్ అయిపోయా. మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘కందిరీగ’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా తరువాత మళ్ళీ అలాంటి విజయవంతమైన సినిమాయే చెయ్యాలని డిసైడ్ అయ్యాం. నేను శైలజ తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అన్ని జాగ్రత్తలతో ఈ సినిమా చేసాను. సినిమాలో నాన్న సెంటిమెంట్ తో పాటు ఓ మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

నాకో లెక్కుంది…

నా కెరీర్ లో కమర్షియల్ కథలతోనే కొన్ని ప్రయోగాలు చేశాను. ‘జగడం’,’ఎందుకంటే ప్రేమంట’, ‘మసాలా’ వంటి ప్రయోగాలు కూడా చేశాను. ఆ సినిమాలు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు కానీ ‘నేను శైలజ’ సినిమా నాకు ఓ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కొన్ని సార్లు మనం చేసే సినిమాలు అందరినీ ఆకట్టుకోలేక పోవచ్చు కానీ మనం మన పని చేసుకుపోవాలి..

_iva18660015

ఆమె చాలా చిలిపి..

హైపర్ తో మరో సారి రాశి ఖన్నా తో వర్క్ చెయ్యడం హ్యాపీ గా ఉంది.. రాశి నటన లో కామెడీ టచ్ ఉంటుంది అది ఈ సినిమాలోని తన పాత్ర కు బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ అందరినీ అలరిస్తుంది…

హైపర్ గురించి..

‘హైపర్’ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో నాకు సత్య రాజ్ గారికి మధ్య వచ్చే సన్నివేశాలు, నా క్యారెక్టర్, రాశి పెర్ఫార్మన్స్, జిబ్రాన్ మ్యూజిక్ అలాగే మణి శర్మ గారి బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్స్. ఈ నెల 30 న విడుదల కానున్న ఈ సినిమా నా కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందని ఆశిస్తున్నా..