సూపర్ హిట్ ఆల్బమ్ తో రెడీ అవుతున్న రామ్-దేవిశ్రీ

Tuesday,October 10,2017 - 01:56 by Z_CLU

రామ్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే 4 సినిమాలొచ్చాయి..వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకూ వచ్చిన ప్రతీ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ ఫెవరెట్ ఆల్బమ్స్ లిస్ట్ లో మంచి ప్లేస్ అందుకున్నాయి. లేటెస్ట్ గా ‘నేను శైలజ’ సినిమాతో మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకొని సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ కాంబో మరో సూపర్ హిట్ ఆల్బమ్ తో రెడీ అవుతుంది.

ప్రస్తుతం రామ్ – దేవి కాంబినేషన్ లో వస్తున్న ‘వున్నది ఒకటే జిందగీ’ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు సూపర్ హిట్ అయిపోయాయి… ‘ఫ్రెండు మారినా- ట్రెండు మారడే’, ‘వాట్ అమ్మ వాట్ ఈజ్ థిస్ అమ్మ’ అంటూ సాగే ఈ పాటలు ప్రస్తుతం చార్ట్ బస్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ అందుకున్నాయి. ఈ రెండు పాటలు లిరిక్స్ పరంగానూ అందరినీ ఎట్రాక్ట్ చేయడంతో ఈ ఆల్బమ్ పై మరింత క్రేజ్ నెలకొంది.

ఇప్పటికే రెండు పాటలతో అందరినీ ఆకట్టుకున్న ఈ కాంబో ఈ ఆల్బమ్ లో మిగతా పాటలతో కూడా అదే రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుందట. అక్టోబర్ 27న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో 13న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. సో ఈ ఆల్బమ్ తో రామ్ – దేవి కాంబినేషన్ మరో సూపర్ హిట్ అందుకోవడం ఖాయం అన్నమాట.