Acharya Teaser వాయిస్ ఓవర్ ఎవరంటే ?

Wednesday,January 27,2021 - 12:48 by Z_CLU

మోస్ట్ ఎవైటింగ్ మెగా టీజర్ వచ్చేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ‘ఆచార్య’ టీజర్ రెడీ అవుతుంది. మరో రెండు రోజుల్లో అంటే జనవరి 29న  4గం 05 నిమిషాలకు ‘Doors To Dharmasthali’ పేరుతో టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ టీజర్ రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అవ్వనుందని చరణ్ గొంతు టీజర్ కే హైలైట్ అని టాక్ వినబడుతుంది. ఇదే విషయాన్ని మీమ్ ద్వారా వరుణ్ తేజ్ కూడా ట్వీట్ చేశాడు. దీంతో మెగా టీజర్ కి చరణ్ వాయిస్ ఓవర్ అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టేశారు.

Siddha-ramcharan

సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి సిద్ద పాత్ర ద్వారా చిరు క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ కొరటాల టీజర్ ప్లాన్ చేశాడా? అనే సందేహం అభిమానుల్లో కలుగుతుంది. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఇది జస్ట్ ప్రచారమే అనుకోవచ్చు.

 చరణ్ కెరీర్ లోనే బెస్ట్ !