మెగా హీరో సంక్రాంతి సెంటిమెంట్

Monday,July 03,2017 - 04:26 by Z_CLU

రంగస్థలం  గ్రాండ్ హిట్ కానుంది. అదేంటి.. రిలీజ్ కాకుండానే ఎలా చెబుతున్నాం అనుకుంటున్నారు. ఇది మేం చెప్పిది కాదు.. రామ్ చరణ్ బల్లగుద్ది మరీ చెబుతున్న విషయం. ఎస్.. రంగస్థలంపై రామ్ చరణ్ కొండంత నమ్మకంతో ఉన్నాడు. దీనికి కారణం సంక్రాంతి సెంటిమెంట్.

సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సూపర్ హిట్ కొట్టాడు మెగా పవర్ స్టార్. 2013 సంక్రాంతికి నాయక్ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు చెర్రీ. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2014 సంక్రాంతికి ఎవడు సినిమాను రిలీజ్ చేశాడు రామ్ చరణ్. అది కూడా  సూపర్ హిట్ అయింది.

ఇప్పుడీ సెంటిమెంట్ తో సంక్రాంతి సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు చరణ్. అందుకే సుకుమార్ తో చేస్తున్న రంగస్థలం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రెడీ చేస్తున్నాడు. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.