RC16 షూటింగ్ ఎప్పుడంటే ?

Thursday,August 18,2022 - 12:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా కంప్లీట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు చరణ్. ఇక గౌతం తిన్ననూరి తో చేయబోతున్న #RC16 సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబర్ నుండి సెట్స్ పై వెళ్లనుందని సమాచారం.

ప్రస్తుతం స్క్రిప్ట్ లాక్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న గౌతం  అనిరుద్ తో త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టనున్నాడు. జెర్సీ తో గౌతం , అనిరుద్ కాంబో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెల్సిందే. అందుకే మళ్ళీ అనిరుద్ నే మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడు గౌతం. రామ్ చరణ్ – అనిరుద్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా ఇది. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు వర్క్ చేస్తున్న అనిరుద్ నెక్స్ట్ తెలుగు సినిమా ఇదే.

యూవీ క్రియేషన్స్ , ఎం వీ ఆర్ సినిమాస్ బేనర్స్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే కాస్టింగ్ ఫైనల్ చేయనున్నారు. జెర్సీ తో ఆడియన్స్ ని వివరీతంగా ఇంప్రెస్ చేసిన గౌతం తిన్ననూరి తో రామ్ చరణ్ చేయనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics