చిట్టిబాబుకు లైన్ క్లియర్

Monday,March 26,2018 - 04:15 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం. ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమాను చూసిన సెన్సార్ అధికారులు మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ పూర్తవ్వడంతో మూవీ విడుదల తేదీని అధికాారికంగా ప్రకటించారు. మార్చి 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఓవర్సీస్ లో 29 నుంచే ప్రీమియర్స్ షురూ కానున్నాయి.

సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చెవిటివాడిగా నటించాడు రామ్ చరణ్. సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ ఇదే. దీనికి తోడు ఇది 1980లనాటి కథ కావడంతో రంగస్థలంపై అంచనాలు పెరిగాయి. తాజాగా రిలీజైన జ్యూక్ బాక్స్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ట్రేడ్ లో హాట్ గా మారింది రంగస్థలం

జగపతిబాబు విలన్ గా నటించిన ఈ సినిమాలో చరణ్ అన్నగా ఆది నటించాడు. మరో రెండు కీలక పాత్రల్లో అనసూయ, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పై తెరకెక్కింది రంగస్థలం.