హైదరాబాద్ లో రామ్ చరణ్ 'ధ్రువ' షూటింగ్

Tuesday,July 19,2016 - 06:36 by Z_CLU

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా, ఏస్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. ఈ చిత్రం ఇటీవ‌లే కాశ్మిర్ షెడ్యూల్ పూర్తిచేసుకుని జులై నెలాఖ‌రువ‌ర‌కూ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అగ‌ష్టు లో సాంగ్స్ చిత్రీక‌ర‌ణ జరగనుంది.

      ఈ చిత్రంలో రామ్ చరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధం అవుతున్నారు . విభిన్నమైన కథతో , ఆశ‌క్తిక‌ర‌మైన క‌థంశంతో రామ్‌ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంద ని అంటున్నారు చిత్ర యూనిట్. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫెర్‌ఫార్మెన్స్‌, ర‌కూల్‌ ప్రీత్ సింగ్ అందచందాలు అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మ‌రో హైలైట్ నిలుస్తాయి అంటున్నారు యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు. సినిమాను దసరా కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్