అభిమానులకు రామ్ చరణ్ లేఖ

Tuesday,February 05,2019 - 12:09 by Z_CLU

అభిమానులకు ఎమోషనల్ గా లెటర్ రాశాడు రామ్ చరణ్. తన రీసెంట్ సినిమా ‘వినయ విధేయ రామ’ అంతగా మెస్మరైజ్ చేయకపోగా, సినిమాలోని కొన్ని సీక్వెన్సెస్ ఫ్యాన్స్ ని చాలా డిజప్పాయింట్ చేసింది. అందుకే ఫ్యాన్స్ కి సమాధానం చెప్పుకున్నాడు చెర్రీ. దాంతో రామ్ చరణ్ జెన్యూన్ గెస్చర్ కి మరింత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ఫ్యాన్స్.

‘వినయ విధేయ రామ’ కథ స్థాయిలో ఉన్నప్పుడు అద్భుతంగా అనిపించినా, దురదృష్టవశాత్తు అది స్క్రీన్ పై అంతగా ట్రాన్స్ లేట్ అవ్వలేదు. కానీ సినిమా కోసం మీరందరి అంచనాలను అందుకోవడానికి చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ థాంక్స్.’ అని లెటర్ లో మెన్షన్ చేశాడు చెర్రీ.

హిట్స్, ఫ్లాప్స్ అని తేడా లేకుండా ఎప్పుడూ సపోర్టివ్ గా ఉండే ఫ్యాన్స్ కి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకున్న రామ్ చరణ్, ‘మీ ప్రేమ, అభిమానం ఉన్నంతవరకు ఇంకా ఇంకా కష్టపడతానని, మంచి సినిమాలు చేస్తానని’ లెటర్ లో రాశాడు మెగా పవర్ స్టార్.