ఇప్పుడు తేజ్ తరవాత రామ్ చరణ్ - చిరంజీవి

Sunday,June 10,2018 - 12:35 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘తేజ్ I love u ‘ చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ఈ నెల 28  న రిలీజవుతుంది. అయితే ఇప్పటికే భారీ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, నిన్న ఈ సినిమా ఆడియో లాంచ్ జరుపుకున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ కూడా అటెండ్ అవ్వడం తో ఈ  సినిమాకి మరింత హైప్ ఆడ్ అయింది.

ఈ ఈవెంట్ లో సినిమా  ప్రొద్యూసర్ K .S రామారావు తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడిన చిరు, రాజమౌళి సినిమా తరవాత రామ్ చరణ్ సినిమా  K .S రామారావు బ్యానర్ లో ఉండబోతుందని చెప్పుకున్నాడు. ‘డైరెక్టర్ ఎవరైనా సరే ఆయన బ్యానర్ లో సినిమా మాత్రం తప్పకుండా చేస్తానని చెర్రీ మాట ఇచ్చాడ’ని  చెప్పుకున్నాడు మెగాస్టార్.

గతంలో   k . S . రామారావు తో ‘అభిలాష’ సినిమాతో బిగిన్ అయిన తన జర్నీ గురించి ఎంతో ఇమోషనల్ గా చెప్పుకున్న చిరంజీవి, ఆయన బ్యానర్ లో సినిమా వచ్చిందంటే కంపల్సరీగా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. ఇప్పుడీ ‘తేజ్ I love u  ‘ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు మెగాస్టార్.