ప్రభాస్ సినిమాలో 'బ్రూస్ లీ' విలన్

Friday,July 28,2017 - 01:45 by Z_CLU

ప్రభాస్ సాహో ప్రీ ప్రొడక్షన్ ఫాస్ట్ పేజ్ లో జరుగుతుంది. కానీ ఈ సినిమా హీరోయిన్ విషయంలో క్రియేట్ అయి ఉన్న హై ఎండ్ సస్పెన్స్ మాత్రం క్లియర్ అవ్వడం లేదు. కాకపోతే తక్కిన స్టార్ కాస్ట్ సెలెక్షన్ విషయంలో సూపర్ ఫాస్ట్ గా ఉన్న సినిమా యూనిట్, మొన్నటికి మొన్న బాలీవుడ్ నటుడు ‘నీల్ నితిన్ ముకేష్’ ని విలన్ గా ఫిక్స్ చేసుకుంది ఆ తరవాత ‘చుంకీ పాండే’ ఇప్పుడు తమిళ నటుడు ‘అరుణ్ విజయ్’ ని ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమాలో అరుణ్ విజయ్ ఎగ్జాక్ట్ గా ఏ రోల్ ప్లే చేయనున్నాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే అరుణ్ విజయ్ గతంలో రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ లో విలన్ గా నటించి అదరగొట్టాడు. ఇప్పుడు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో తెరకెక్కనున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కబోతుంది. అందుకే అన్ని భాషల్లోను ఫెమీలియర్ ఫేసెస్ కే ప్రయారిటీ ఇస్తుంది సాహో టీమ్. ఇక హీరోయిన్ విషయంలోను అలాంటి నిర్ణయమే తీసుకోనున్న సినిమా యూనిట్, ఓటేయబోయే లక్కీ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.